Share News

Chandrababu-Kadapa: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిపారు: చంద్రబాబు

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:51 PM

ఏపీలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని ఆయన తెలిపారు. కడప జిల్లాలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Chandrababu-Kadapa:  వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిపారు: చంద్రబాబు
Chandrababu-Kadapa

కడప, నవంబర్, 19: వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వసం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చంద్రబాబు చెప్పారు. కడప జిల్లాలో నిర్వహిస్తోన్న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తాను కూడా రైతు బిడ్డనే అని చెప్పిన చంద్రబాబు, తనకు రైతుల సమస్యలు బాగా తెలుసని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.


కడపజిల్లా పెండ్లిమర్రిలో ఈ సాయంత్రం నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. పీఎం కిసాన్‌ - అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు అంశాలు వెల్లడించారు.

  • ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చాం: సీఎం చంద్రబాబు

  • సూపర్‌సిక్స్‌ సాధ్యమేనా అని ప్రశ్నించారు.. సూపర్‌సిక్స్‌ హామీలను సూపర్‌హిట్‌ చేశాం

  • రెండో విడత పీఎం కిసాన్‌ - అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశాం

  • రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.3,200 కోట్లు జమ

  • ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు చొప్పున జమ చేశాం

  • 2024 జనవరి 19న 'రా కదిలి రా' కార్యక్రమం కోసం కమలాపురం వచ్చాను..

  • నాడు ఏ ఉత్సాహంతో ఉన్నారో.. ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఉన్నారు

  • కడపలో నిర్వహించిన మహానాడును విజయవంతం చేశారు

  • మహానాడు ద్వారా కడప గడ్డపై టీడీపీ సత్తా ఏంటో నిరూపించారు

  • రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా హామీలు అమలు చేస్తున్నాం

  • రైతులు ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టి లాభాలు పెంచుకోవాలి

  • డబల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో రాష్ట్రంలో ఎప్పుడూ లేని అభివృద్ధి చేస్తున్నాం

  • రాష్ట్ర పునర్నిర్మాణం కోసం జనసేన, బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం

  • మనం పండించిన పంటలను ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలి

  • ఇతర దేశాలకు ఎగుమతి చేస్తేనే రైతులకు ఆదాయం వస్తుంది

  • పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తామంటే.. రైతులకు ఇబ్బందులు వస్తాయి

  • రైతుల అభివృద్ధి కోసం పంచ సూత్రాలు తీసుకొచ్చాం..

  • పంచ సూత్రాలను రైతులు అమలు చేస్తే.. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది

  • రైతులు డిమాండ్‌ ఆధారిత పంటలను సాగు చేయాలి

  • నేనూ రైతుబిడ్డనే.. మా నాన్నకు వ్యవసాయంలో సహాయం చేసేవాడిని

  • ఎన్ని ఇబ్బందులొచ్చినా.. నదుల అనుసంధానం పూర్తి చేస్తా

  • నదుల అనుసంధానం పూర్తి చేసి.. అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇస్తాం

  • రైతులకు రూ.10 వేల కోట్ల విలువైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నాం

  • రాయలసీమలో పుట్టాను.. రాయలసీమ ప్రజల కష్టాలు తెలుసు

  • రాయలసీమ ఎడారి అవుతుందన్నారు

  • రాయలసీమ ప్రజల్లో ఆశలు చిగురింపచేసిన వ్యక్తి ఎన్టీఆర్‌

Updated Date - Nov 19 , 2025 | 05:26 PM