Share News

JC Prabhakar Reddy : కేతిరెడ్డి విషయంలో జోక్యం వద్దు జగన్‌

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:14 AM

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చే సమస్యే లేదని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

JC Prabhakar Reddy : కేతిరెడ్డి విషయంలో జోక్యం వద్దు జగన్‌

  • తాడిపత్రికి రానిచ్చే సమస్యే లేదు: జేసీ

తాడిపత్రి, జూలై 16(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చే సమస్యే లేదని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇందులో జోక్యం చేసుకోవద్దని జగన్‌కు బుధవారం సూచించారు. ‘ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన ఘటన గురించి మాట్లాడుతున్నావ్‌. ఆరోజు ఆయన అక్కపై (జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య) 12 కేసులు పెట్టారు. అన్నెం పున్నెం ఎరుగని ఆమె కోడలిపై 3 కేసులు పెట్టారు. నన్ను, నా కుమారుడిని జైలుకు పంపించారు. ఈరోజు పెద్దారెడ్డి ఊళ్లోకి వస్తానంటే ఎందుకు రానిస్తాం..? అప్పట్లో పెద్దారెడ్డి మా ఇంట్లోకి వచ్చి దుర్భాషలాడితే నువ్వెందుకు మాట్లాడలేదు..? మా నాన్న ఫ్రీడం ఫైటర్‌. మా అన్న దివాకర్‌రెడ్డి 6సార్లు ఎమ్మెల్యే, మినిష్టర్‌, ఒకసారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్‌ చైర్మన్‌, ఒకసారి ఎమ్మెల్యే. నా కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే. నా భార్య ఉమారెడ్డి తమ్ముడు ప్రసన్నకుమార్‌రెడ్డి గురించి మాట్లాడడం మంచిదే. కానీ వాళ్ల అక్కకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదే..? మీ తాత చనిపోయినపుడు మధ్యాహ్నం వరకు పులివెందుల ప్రశాంతంగా ఉంది. ఘర్షణలొద్దని మీ నాన్న సముదాయించారు. కానీ సాయంత్రం పెద్దారెడ్డి వెళ్లి డీఎన్‌రెడ్డి ఇంటిని దహనం చేసిన విషయం మీ అమ్మనడిగి తెలుసుకో..! పెద్దారెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు’ అని చెప్పారు.

Updated Date - Jul 17 , 2025 | 04:14 AM