Share News

MS Raju: ఇక్కడోళ్లకూ చేతులు, కొడవళ్లు ఉంటాయ్‌..

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:21 AM

శవాల పునాదులపైనే జగన్‌ వైసీపీని నిర్మించారు. ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు’ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు విమర్శించారు.

MS Raju: ఇక్కడోళ్లకూ చేతులు, కొడవళ్లు ఉంటాయ్‌..

  • శవాల పునాదులపైనే జగన్‌ వైసీపీని నిర్మించారు: ఎమ్మెల్యే రాజు

అనంతపురం క్రైం, దుత్తలూరు(ఉదయగిరి), అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘శవాల పునాదులపైనే జగన్‌ వైసీపీని నిర్మించారు. ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు’ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు విమర్శించారు. అనంతపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరుకుతాం అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించేలా సైకో బ్యాచ్‌ను జగన్‌ రెచ్చగొడుతున్నారు. ఒక మాజీ సీఎం ఇదేనా సూచించేది. ఇక్కడున్న వాళ్లకూ చేతులు, కొడవళ్లు ఉంటాయని గుర్తుంచుకోవాలి. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి లా అండ్‌ ఆర్డర్‌ సమస్య సృష్టించేలా జగన్‌ వ్యవహరిస్తున్నారు.. రెడ్‌ బుక్‌ సామాన్య ప్రజలకు కాదు. మద్యం స్కాంలో చెవిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు... జగన్‌ ఇంటి తలుపులు కొట్టడం ఖాయం’ అని రాజు హెచ్చరించారు.

Updated Date - Jun 20 , 2025 | 05:22 AM