Ravi Naidu Slams Jagan: యువత భవిష్యత్తుతో జగన్ చెలగాటం
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:40 AM
రాష్ట్రంలోని యువతను మాజీ సీఎం జగన్ రెచ్చగొడుతూ.. వారిని హత్యారాజకీయాల..

అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యువతను మాజీ సీఎం జగన్ రెచ్చగొడుతూ.. వారిని హత్యారాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నారని ఏపీ క్రీడాపాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎంగా పనిచేసిన వ్యక్తి యువత భవిష్యత్తును కోరుకోవాలే తప్ప, ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. దీనిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, వారి పిల్లల భవిష్యత్తుపై ఆలోచన చేయాలని సూచించారు. జగన్ ఎక్కడ పర్యటన చేసినా.. బెదిరింపులు తప్ప అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన సందర్భాలు లేవని విమర్శించారు. ‘ప్రజలు ఛీకొట్టినా మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ పగటి కలలు కంటున్నారు. ప్రజలకు మేలు చేస్తే అధికారంలోకి వస్తారే తప్ప.. తలలు తీసేస్తాం, రప్పా రప్పా అంటే అధికారంలోకి ఎలా వస్తారు?’ అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్