Home Minister Anitha: ఎమర్జెన్సీ రోజునే జగన్ విధ్వంస పాలన మొదలు
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:19 AM
‘దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చివేతతో 2019 జూన్ 25న తన విధ్వంస పాలన ప్రారంభించారు.

2019 జూన్ 25నే ప్రజావేదిక కూల్చేశారు: హోం మంత్రి అనిత
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చివేతతో 2019 జూన్ 25న తన విధ్వంస పాలన ప్రారంభించారు. ఐదేళ్లు భరించిన ప్రజలు 11 సీట్లతో ఆయనకు బుద్ధి చెప్పారు’ అని హోం మంత్రి అనిత అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘2019 నుంచి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడిచింది. ఇప్పుడు నీతులు చెబుతున్న జగన్‌కు గత ఐదేళ్ల విధ్వంసం గుర్తుకు రావడం లేదా?విధ్వంసాలను మళ్లీ రెచ్చగొట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
వైసీపీ మూకలు ఇంకోసారి రప్పా రప్పా అంటే ప్రజలే ఎదురుతిరిగి వారిని కోసేలా ఉన్నారు. జగన్ అతని బ్యాచ్ ఆటలు ఇకపై సాగవు. పోలీసుల సూచనలు సైతం పెడచెవిన పెట్టి మరీ మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఊరుకోవాలా? జగన్ తాలూకు సైకో నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. విధ్వంసం, విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి’ అని అనిత అన్నారు.