Singapore: ఏపీలో పెట్టుబడులు పెట్టండి: సింగపూర్ బిజినెస్ ఫోరమ్‌లో చంద్రబాబు, లోకేష్
ABN , Publish Date - Jul 28 , 2025 | 06:12 PM
ఏపీలో పెట్టుబడులు పెట్టండని ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్‌లో పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. సింగపూర్ తో ఏపీకి మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

సింగపూర్, జులై, 28: ఏపీలో పెట్టుబడులు పెట్టండని ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్‌లో పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. సింగపూర్ తో ఏపీకి మూడు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బృందం.. ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొని ప్రసంగించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, సింగపూర్ ప్రభుత్వంతో 3 దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని చంద్రబాబు తెలిపారు. అమరావతి రూపకల్పన కోసం 2014లో సింగపూర్‌లో పర్యటించానని ఈ సందర్భంగా చంద్రబాబు ఫోరమ్ కు గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ రెండు రోజులుగా సింగపూర్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో అనేక కార్యక్రమాల్లో వీరిరువురూ పాల్గొన్నారు. సింగపూర్‌లోని పలు ప్రాజెక్టులను సందర్శించారు. ఇవాళ ఏపీ - సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.
విశాఖలో నిర్వహించబోతున్న పెట్టుబడుల సదస్సుకు సన్నాహక సమావేశంగా సింగపూర్ లో ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నవంబరులో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ , ఆటోమొబైల్ ఇంకా అనేక రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు.