Amaravati Independence Day: రాజధానికి స్వాతంత్య్రం
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:04 AM
ఇంతవరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి

ఈసారి అమరావతిలోనే పంద్రాగస్టు వేడుకలు
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఇంతవరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకులను ఈసారి రాజధాని అమరావతిలోనే నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ ఈ విషయాన్ని వెల్లడించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సచివాలయం వెనుక ఇటీవల పీ-4 సభ నిర్వహించిన ప్రదేశంలోనే స్వాతంత్య్ర వేడుకలు జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రాజధానిలోనే తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు జరపనున్న నేపథ్యంలో కార్యక్రమం విజయవంతం కావటానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!