Share News

MLA: సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:21 AM

గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురు వారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.

MLA: సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం
MLA Palle Sindhura Reddy speaking in the meeting

- ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి

నల్లమాడ, జూన 26(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురు వారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు సమస్యలపై వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వారు అధికారుల చుట్టూ తిరగకుండా పరిష్కరించాలని సూచించారు. బాగా ఆలోచిస్తే ఎం తటి క్లిష్టమైన సమస్యనైనా అవకాశం ఉన్నంత వరకు పరిష్కరించవచ్చని తెలిపారు. గోపేపల్లి తండాలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న చుక్క ల భూముల సమస్యకు మూడురోజుల్లో పరిష్కారం చూపిన తహసీల్దార్‌ రంగనాయకులను ఎమ్మెల్యే అభినందించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియ జేయాలని అధికారులపై సూచించారు. గ్రామాల్లో విద్యుత, తాగునీరు, వైద్యం, పారిశుధ్యం, ఉపాధి పనులు సక్రమంగా అమలయ్యేలా చూడా ల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. ప్రజలు, రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఎన్నికల హామీలన్నీ ఒక్కొక్కటాగా నెరవేరుస్తు న్నామని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ సునీతబాయి, తహసీల్దార్‌ రంగనాయకులు, ఎంపీడీఓ ఆజాద్‌, సూపరింటెండెంట్‌ గజ్జల శ్రీనివాస రెడ్డి, అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచలున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 27 , 2025 | 12:21 AM