Share News

IBM: 2029కల్లా మూడో క్వాంటమ్‌ కంప్యూటర్‌

ABN , Publish Date - Jul 01 , 2025 | 05:42 AM

మూడో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను 2029 నాటికి అందుబాటులోకి తెస్తామని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్‌ పటేల్‌ చెప్పారు.

IBM: 2029కల్లా మూడో క్వాంటమ్‌ కంప్యూటర్‌

  • సాంకేతికతలో రాష్ట్రానికి సంపూర్ణ సహకారం

‘ఆంధ్రజ్యోతి’తో ఐబీఎం ఇండియా ఎండీ సందీప్‌ పటేల్‌ అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మూడో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను 2029 నాటికి అందుబాటులోకి తెస్తామని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్‌ పటేల్‌ చెప్పారు. ఇప్పటికే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను బ్యాంకులు, పేటీఎం వంటి ఆర్థిక సంస్థలు వినియోగిస్తున్నాయని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పా రు. సాంకేతికతలో రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌తో సంప్రదాయ సాఫ్ట్‌వేర్‌ రంగం తీవ్రంగా నష్టపోతుందన్న ఆందోళన ఉందన్న ప్రశ్నకు.. కొత్త సాంకేతిక నైపుణ్యం వస్తున్నప్పుడు ఇలాంటి ఆందోళనలు తప్పవని బదులిచ్చారు. ప్రస్తుతం రెండో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఐబీఎం రూపొందించిందని.. 2029 నాటికి అత్యంత వేగవంతమైన మూడో క్వాంటమ్‌ కంప్యూటర్‌ను సిద్ధం చేస్తామన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 05:42 AM