Share News

Vijayawada: వ్యవసాయశాఖ కబంధ హస్తాల నుంచి ఉద్యాన శాఖను కాపాడండి

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:39 AM

గ్రామ ఉద్యాన సహాయకులు, వ్యవసాయ శాఖ కబంధ హస్తాల నుంచి ఉద్యాన శాఖను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాబ్‌ చార్ట్‌ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించాలన్నారు

Vijayawada: వ్యవసాయశాఖ కబంధ హస్తాల నుంచి ఉద్యాన శాఖను కాపాడండి

  • ప్రభుత్వానికి ఉద్యాన సహాయకుల విజ్ఞప్తి

విజయవాడ(గాంధీనగర్‌), ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ కబంధ హస్తాల నుంచి ఉద్యాన శాఖను కాపాడాలని గ్రామ ఉద్యాన సహాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాబ్‌ చార్ట్‌ ప్రకారం మాత్రమే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ హార్టికల్చర్‌ జేఏసీ సమావేశం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ పేరుకు తాము ఉద్యాన సహాయకులమైనప్పటికీ తమపై పెత్తనమంతా వ్యవసాయ శాఖ అధికారులేదనన్నారు. తమకు వ్యవసాయ శాఖ పనులను అప్పగించడంతో ఉద్యాన రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నామని తెలిపారు. ఆరేళ్లుగా ఎటువంటి పదోన్నతులు, బదిలీలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:39 AM