Srisailam: మల్లికార్జునుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:08 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ దంపతులు శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి అమ్మవార్ల దర్శనం పొందారు. వారు స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు

శ్రీశైలం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లికార్జున స్వా మి, భ్రమరాంబాదేవి అమ్మవార్ల ను సోమవారం హైకోర్టు నాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ సతీసమేతంగా దర్శించుకున్నారు. న్యా యమూర్తి దంపతులు స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు న్యాయమూర్తి దంపతులను ఆశీర్వదించగా, అధికారులు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.