Heavy Flood: తుంగభద్ర, శ్రీశైలంకు భారీగా వరద
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:31 AM
తుంగభద్ర డ్యాంలో 75.934 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కర్నూలు, జూలై 10(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాంలో 75.934 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 46,955 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయానికీ వరద కొనసాగుతోంది. ఎగువన జూరాల, సుంకేసుల నుంచి 1,75,233 క్యూసెక్కుల వరద డ్యాంకు చేరుతోంది. స్పిల్‌వే ద్వారా 81,195 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 67,552 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.