AP Weather: ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:15 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు భయంకరమైన ఎండలు, మరోవైపు కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ వాతావరణ అనిశ్చితి మరో నాలుగు రోజులు కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది

మరో 4 రోజులు అనిశ్చితి!
విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత, ఉక్కపోత ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని.. సోమవారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. శ్రీకాకు ళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లా ల్లో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల గాలులకు మామిడి, జీడి మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అల్లూరి జిల్లా దళపతిగూడలో 46, అనకాపల్లి జిల్లా గొలుగొండలో 34, దార్లపూడిలో 26.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. కోస్తా, సీమల్లోని మిగిలిన ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగింది. మరో 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం కడప జిల్లా సిద్ధవటంలో 41.1, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో 41, నంద్యాల జిల్లా రుద్రవరంలో 40.6, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దెబ్బతిన్న పంటలు
అనంతపురం అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కోతకొచ్చిన వరి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేశాయి.