Share News

MLC Election Result: ప్రభుత్వంపై పాజిటివ్ ఓటింగ్.. వైసీపీని నమ్మని యూత్

ABN , Publish Date - Mar 04 , 2025 | 10:22 AM

ఏపీలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు. తూర్పు, పశ్చిమగోదావరి స్థానంలో కూటమి అభ్యర్థి స్పష్టమైన మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు.

MLC Election Result: ప్రభుత్వంపై పాజిటివ్ ఓటింగ్.. వైసీపీని నమ్మని యూత్
Chandrababu and Pawan Kalyan

తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటూ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారంటూ చెప్పుకొచ్చారు. తీరా ఫలితం చూస్తే వైసీపీది ఫేక్ ప్రచారమని తెలిపోయిందట. వైసీపీ పోటీలో లేకపోయినా, పీడీఎఫ్ అభ్యర్థుల కోసం పనిచేయాలని పార్టీ అధిష్టానం సూచించింది. దీంతో తూర్పు, పశ్చిమగోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతో పాటు కృష్ణా, గుంటూరులో వైసీపీ శ్రేణులు పీడీఎఫ్ అభ్యర్థుల కోసం శ్రమించారు. అయినప్పటికీ వైసీపీపై విశ్వాసం లేకపోవడంతో యువత కూటమి అభ్యర్థివైపు మొగ్గుచూపినట్లు ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం పనితీరుపై పట్టభద్రులు సంతృప్తితో ఉండటంతోనే తొలి ప్రాధాన్యత ఓటుతోనే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజా గెలుపొందినట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలోనూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తిస్థాయిలో లెక్కపెడితే రాజశేఖరం విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో తప్పనిసరిగా విజయం సాధిస్తారని కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం అసాధ్యం. కానీ ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే అదొక రికార్డు అవుతుంది. గతంలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే అభ్యర్థులు విజయం సాధించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరిగింది.


పాజిటివ్ ఓటింగ్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం ముందువరుసలో ఉంది. వీటిని గమనించి పట్టభద్రులు కూటమి అభ్యర్థులకు ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ విష ప్రచారం చేసినప్పటికీ యువతపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందనేది ఫలితం చూస్తే అర్థమవుతోంది.


వైసీపీపై అసఅంతృప్తితోనే..

వైసీపీపై ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది పట్టభద్రుల ఎన్నికల్లో స్పష్టమైంది. వైసీపీ నేరుగా పోటీలో లేనప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించింది. దీంతో వామపక్షాలతో కలిసి కొన్నిచోట్ల వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ప్రజలు వైసీపీపై అసంతృప్తితో ఉండటంతో పీడీఎఫ్ అభ్యర్థులవైపు మొగ్గుచూపలేదని తెలుస్తోంది. పోటీచేసి ఓడిపోయామని అనిపించుకోవడంకంటే పోటీకి దూరంగా ఉండటమే మేలని వైసీపీ నేతలు భావించినప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థుల కోసం విస్తృతంగా వైసీపీ క్యాడర్ తిరిగింది. అయినప్పటికీ వైసీపీకి పట్టభద్రులు బిగ్ షాక్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 04 , 2025 | 10:22 AM