Singayya Death Case: సింగయ్య మృతిపై లోతైన దర్యాప్తు.. విచారణకు జగన్ సెక్యూరిటీ
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:27 PM
Singayya Death Case: జగన్ భద్రతా సిబ్బందిని పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

అమరావతి, జూన్ 23: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జగన్ కారు కింద సింగయ్య పడిన వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్‌కు రక్షణగా ఉన్న భద్రతా సిబ్బందిని గుంటూరు పోలీసులు పిలిపించారు. జగన్ ముఖ్య భద్రతా అధికారి, ఇతర భద్రతా సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపించి విచారిస్తున్నారు.
పర్యటనలో భాగంగా జగన్ అనేక చోట్ల ఆగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. జగన్ కారు కింద పడిన సింగయ్యను ఎవరు బయటకు తీశారు.. ఆయనను ఎందుకు ఆస్పత్రికి తరలించలేదు అనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అందులో భాగంగానే జగన్ భద్రతా సిబ్బందిని కూడా పోలీసులు పిలిపించి విచారిస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఎవరు ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ.. ఈ ప్రమాదం గురించి ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదని అధికారులు నిలదీశారు.
నాలుగు రోజులు అవుతున్నా కూడా విజువల్స్ బయటకు వచ్చే వరకు భద్రతా సిబ్బంది కామ్‌గా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో ముగ్గురు సెక్యూరిటీ అధికారులను కూడా ఉన్నతాధికారులు ప్రశ్నించారు. అయితే తాము కారుకు ఎడమ వైపు అంటే జగన్ అభివాదం చేసే వైపు ఉన్నామని భద్రతా సిబ్బంది చెప్పారు. మరి కుడివైపు రక్షణగా ఎవరు ఉన్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ వాహనానికి క్లోజ్ సర్క్యూట్‌లో ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా అధికారులు పిలిపించి విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు
వృద్ధురాళ్ల హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు
వైసీపీ కార్యకర్తలపై జగన్ కామెంట్ల ప్రభావం
Read Latest AP News And Telugu News