Share News

Minister Ram Prasad Reddy: గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్..

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:10 PM

క్రీడల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. స్పోర్ట్స్ పాలసీలో పొందుపరిచిన స్పోర్ట్స్ కోటాను పెంచుతూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేయడం శుభపరిణామం అని చెప్పుకొచ్చారు.

Minister Ram Prasad Reddy: గుడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్..
sports quota Increase

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఏపీ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. క్రీడాకారుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పోర్ట్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. క్రీడాకారుల అభివృద్ధికి నిస్వార్థంగా పాటుపడుతున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


ఈ ఉత్తర్వులతో ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖలతో సహా యూనిఫార్మ్డ్ సర్వీసుల్లో పోటీ పరీక్షలకు నేరుగా నియామక అవకాశాలు లభించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 65 క్రీడా విభాగాలు ఈ ప్రత్యక్ష నియామకాల్లో భాగస్వామ్యం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ ప్రోత్సాహంతో క్రీడాకారులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. క్రీడాకారులకు మంచి భవిష్యత్తే తమ ధ్యేయమని, క్రీడల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.


క్రీడల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. స్పోర్ట్స్ పాలసీలో పొందుపరిచిన స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేయడం శుభపరిణామం అని చెప్పుకొచ్చారు. క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి పట్ల సీఎం చంద్రబాబు మరోసారి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని కొనియాడారు. జీవో జారీ చేయడంపై క్రీడాకారులంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రవినాయుడు పేర్కొన్నారు. క్రీడాకారుల తరుఫున సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు శాప్ ఛైర్మన్ రవినాయుడు తెలిపారు. కాగా, ఉద్యోగ్యాల్లో స్పోర్ట్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచాలని సీఎం చంద్రబాబు సర్కార్ గతేడాది నిర్ణయించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్

డల్లాస్‌ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని

Updated Date - Apr 19 , 2025 | 09:17 PM