Share News

Megastar Chiranjeevi: సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్

ABN , Publish Date - Apr 20 , 2025 | 10:23 AM

Megastar Chiranjeevi: ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అరుదైన నాయకుడు మీరని చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Megastar Chiranjeevi:  సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్
Megastar Chiranjeevi wishes to CM Chandrababu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చంద్రబాబు ఏపీకి చేస్తున్నసేవలను ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబుకు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. చంద్రబాబు దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకులని అభివర్ణించారు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకి మెగాస్టార్ చిరంజీవి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

సీఎం చంద్రబాబుకు గవర్నర్, పవన్ జన్మదిన శుభాకాంక్షలు

For More AP News and Telugu News

Updated Date - Apr 20 , 2025 | 10:35 AM