Share News

Amaravati: జనవాణి పనివేళల్లో మార్పు..

ABN , Publish Date - Apr 21 , 2025 | 07:55 AM

గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలను పవన్ కల్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.

Amaravati: జనవాణి పనివేళల్లో మార్పు..
Janavani timings change

అమరావతి: అర్జీదారుల సౌకర్యార్థం వాతావరణంలో ఎండ తీవ్రత వల్ల జనవాణి (Janavani) పని వేళల్లో మార్పులు (timings Change) చేస్తున్నట్లు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం (Mangalagiri Janasena office) ప్రకటించింది. ఈ కొత్త పని వేళలు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త సమయాలు సోమవారం నుండి అమలులోకి వస్తాయని.. అందుకు అనుగుణంగా జనసేన జనవాణి సేవలు వినియోగించుకోవాల్సిందిగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. జనసేన పార్టీ చేపట్టిన జనవాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వేలాదిమంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు తరలివస్తున్నారు.

Also Read..: డోనాల్డ్ ట్రంప్ తీరుపై స్పందించిన భారత్..


కాగా గతంలో జనసేన పార్టీ తరపున జనవాణి కార్యక్రమం నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. వివిధ రకాల సమస్యలతో జనవాణికి వచ్చిన ప్రజలను పవన్ కల్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటినే అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చైనా సరికొత్త హైడ్రోజన్‌ బాంబు

TTD: 15 రోజుల్లో ఖాళీ చేయండి

For More AP News and Telugu News

Updated Date - Apr 21 , 2025 | 07:55 AM