Share News

YCP Ambati Rambabu Confronts: రోడ్డుపై అంబటి రాంబాబు రచ్చ రచ్చ

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:29 PM

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయి ప్రవర్తించారు. రోడ్డుపై పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.

YCP Ambati Rambabu Confronts:  రోడ్డుపై అంబటి రాంబాబు రచ్చ రచ్చ
YCP Ambati Rambabu Confronts

గుంటూరు: వైసీపీ ప్రజాపోరులో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదంటూ కంకరగుంట ఫ్లైఓవర్‌ దగ్గర వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన అంబటి రాంబాబు రెచ్చిపోయి ప్రవర్తించారు. బారికేడ్లను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.


కాగా, నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ 'ప్రజాపోరు' నిరసన ర్యాలీ చేపట్టింది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు.


ప్రభుత్వ నిబంధనలని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటీకి అధికారుల ఆదేశాలను వైసీపీ ఏ మాత్రం లెక్కచేయకుండా రోడ్డుపై ర్యాలీ చేపట్టింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఎంతగా చెబుతున్నా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వినకుండా పోలీసులతోనే దురుసుగా ప్రవర్తించి రచ్చ రచ్చ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...

వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2025 | 05:07 PM