Share News

Gas leak: గ్యాస్ సిలెండర్ లీక్.. అన్ లోడ్ చేస్తుండగా..

ABN , Publish Date - Jan 30 , 2025 | 10:48 AM

మంగళగిరిలోని హెచ్‌పి గ్యాస్ గోడౌన్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిలెండర్‌లు అన్ లోడ్ చేస్తుండగా గ్యాస్ లీకైంది. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరుగులు పెట్టారు. చుట్టు వందలాది గ్యాస్ సిలిండర్‌లు ఉన్నాయి. ఎక్కడ సిలెండర్లు పేలుతాయోనని భయపడుతూ.. లీకైన్ సిలెండర్‌ను బయటకు విసిరి..

 Gas leak:  గ్యాస్ సిలెండర్ లీక్..  అన్ లోడ్ చేస్తుండగా..

గుంటూరు జిల్లా: మంగళగిరిలోని హెచ్‌పి గ్యాస్ (HP Gas) గోడౌన్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలెండర్‌ (Cylinder)లు అన్ లోడ్ (Un Load) చేస్తుండగా ఓ సిలెండర్ నుంచి గ్యాస్ లీకైంది (Gas Leak). దీంతో భయపడిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. చుట్టు వందలాది గ్యాస్ సిలిండర్‌లు ఉన్నాయి. ఎక్కడ సిలెండర్లు పేలుతాయోనని భయపడుతూ.. లీకైన్ సిలెండర్‌ను బయటకు విసిరి.. సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అయితే అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

వేములవాడలో బీభత్సం సృష్టించిన లారీ


కాగా నంద్యాల జిల్లా, నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో గ్యాస్‌ లీకై రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరో ఇంటి స్లాబ్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన వెంకటమ్మ (62), ఆమె కుమారులు సుబ్బరాయుడు, లింగమయ్య మూడు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వెంకటమ్మ లైట్‌ ఆన్‌ చేశారు. అప్పటికే గ్యాస్‌ లీకవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు కుప్పకూలింది. దీంతో వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన ఇంటిని ఆనుకొని ఉన్న సుబ్బరాయుడు ఇంటి శ్లాబ్‌ కుప్పకూలడంతో ఆయన కుమారుడు దినేష్‌(10) అక్కడికక్కడే మరణించాడు. సుబ్బరాయుడు, భార్య రామలక్ష్మి, కుమారుడు కార్తీక్‌తో పాటు అత్త సుబ్బమ్మ, బావమరిది రాములు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి లింగమయ్య ఇల్లు కూడా కుప్పకూలింది. లింగమయ్యతో పాటు ఆయన భార్య వెంకటేశ్వరమ్మ, కుమారులు సుశాంత్‌, సుధీర్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల రూరల్‌ తహసీల్దార్‌ పత్తి శ్రీనివాసులు, తాలుకా సీఐ ఈశ్వరయ్య, అగ్నిమాపక దళ అధికారి యోగేశ్వరరెడ్డి శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలు వెలికితీసి, క్షతగాత్రులను నంద్యాల, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు.


కాగా ఈ ప్రమాదంలో సుమారు రూ.24 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో బాధితులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

మాఘమాసం వచ్చేసింది... శుభ ఘడియలు.. పెళ్లి సందడి..

ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 30 , 2025 | 10:48 AM