Share News

Nandigam Suresh: నందిగం సురేష్‌కు ఎదురు దెబ్బ

ABN , Publish Date - May 19 , 2025 | 11:12 AM

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌‌కు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మాజీ ఎంపీకి కోర్టు రిమాండ్ విధించింది.

Nandigam Suresh: నందిగం సురేష్‌కు ఎదురు దెబ్బ
Nandigam Suresh

గుంటూరు, మే 19: టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు (Former MP Nandigam Suresh) మంగళగిరి కోర్టు (Mangalagiri Court) రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నందిగం సురేష్‌ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే పలు కేసులలో వైసీపీ మాజీ ఎంపీ బెయిల్‌పై ఉన్నారు. ఈరోజు (సోమవారం) ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టులో మాజీ ఎంపీని పోలీసులు హాజరుపర్చగా.. కోర్టు రిమాండ్ విధించింది.


గత శనివారం (మే 17) రాత్రి మాజీ ఎంపీ స్వగ్రామం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ కార్యకర్త రాజు అనే వ్యక్తిపై నందిగం సురేష్, అతడి సోదరుడు, అనుచరుడు మూకుమ్మడి దాడి చేశారు. తన భర్తపై హత్యప్రయత్నం చేశారంటూ రాజు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. రాజును కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించి నందిగం సురేష్‌తో పాటు మరి కొంతమందిపై కేసు నమోదు చేశారు. నిన్న (ఆదివారం) సురేష్‌ను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఈరోజు (సోమవారం) మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. సురేష్‌కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా.. వెంటనే అతడిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

AP EAP CET 2025: ఏపీలో మొదలైన EAP CET 2025 ఎగ్జామ్


కాగా.. నెలల తరబడి నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించి వచ్చిన విషయం తెలిసిందే. గతంలో మరియమ్మ అనే మహిళ హత్య కేసు, తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కూడా అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారు. ఇప్పటి వరకు మాజీ ఎంపీపై 12 కేసులు ఉండగా.. ఇప్పుడు 13వ కేసు నమోదు అయినట్లు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. మరో రెండు కేసులు నమోదు అయితే నందిగం సురేష్‌పై పీడీ యాక్ట్ పెట్టేందుకు సిఫారసు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపేందుకు స్థానిక పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Diamond: వజ్రాన్ని విక్రయించిన రైతు.. ధర ఎంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 19 , 2025 | 11:25 AM