Share News

Gopireddy Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై కేసు నమోదు

ABN , Publish Date - Apr 29 , 2025 | 09:30 PM

Gopireddy Srinivasa Reddy: వైసీపీ మరో నేతపై పోలీస్ కేసు నమోదయింది. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదు కావడంతో.. ఆ జాబితాతో ఈ తాజా మాజీ ఎమ్మెల్యే పేరు సైతం నమోదు కావడం గమనార్హం.

Gopireddy Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై కేసు నమోదు
YCP Ex MLA Gopireddy Srinivasa Reddy

పల్నాడు, ఏప్రిల్ 29: కూటమి ప్రభుత్వంలోని సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పోలీస్ కేసు నమోదయింది. పల్నాడు జిల్లాలోని బుచ్చిపాపన పాలెంలో ఇటీవల తిరునాళ్లు జరిగాయి. ఈ తిరునాళ్లకు హాజరైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్థానిక ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వడ్లమూడి వెంకట కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు పలువురిపై రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


మరోవైపు అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైసీపీ నేతల తమ దుందుడుకు వైఖరిని వీడడం లేదు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అరెస్టయి బెయిల్‌పై విడుదలవుతున్నారు. తాజాగా వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అరెస్టయి.. మంగళవారం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అదీకాక గత ప్రభుత్వ హయాంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఆయన కేబినెట్‌లోని మంత్రుల వరకు అంతా ఒకే రీతిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో 2024 మే, జూన్ మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

AP Govt: ‘వేస్ట్ మేనేజ్‌మెంట్‌’పై కీలక ఒప్పందం

Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

For More AP News and Telugu News

Updated Date - Apr 29 , 2025 | 09:30 PM