Share News

Mannava Mohan krishna: రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎస్ కార్యాలయాలు ఏర్పాటు: చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ

ABN , Publish Date - May 15 , 2025 | 09:41 PM

Mannava Mohan krishna: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరన తర్వాత ఈ సంస్థ చేసిన అభివృద్ధిని ఆయన సోదాహరణగా వివరించారు.

Mannava Mohan krishna: రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎస్ కార్యాలయాలు ఏర్పాటు: చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ
APTS Chaiman Mannava Mohan Krishna

అమరావతి, మే 15: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ వెల్లడించారు. గురువారం అమరావతిలో ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. అంటే జులై 2024 నుంచి 2025 వరకు ఈ ప్రొక్యూర్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా 55,486 టెండర్లు ప్రచురించబడ్డాయని తెలిపారు.

ఈ మొత్తం ప్రాజెక్టుల విలువ రూ. 41 వేల కోట్ల కంటే అధికమన్నారు. ఇక ఈ ఏడాది హయాంలో ఏపీటీఎస్ ప్రొక్యూర్‌మెంట్ సర్వీసెస్ ద్వారా రూ. 110 కోట్లకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏపీటీఎస్ ప్రొక్యూర్‌మెంట్ సర్వీసెస్ లక్ష్యం సుమారు రూ. 600 కోట్లు అని చెప్పారు.


null

సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తృత పరుస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏపీటీఎస్ సంస్థ మెరుగైన సేవలు అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 1986లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటడ్ ప్రారంభమైందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నాటి నుంచి నుంచి నేటి వరకు ఈ సంస్థ ద్వారా రాష్ట్రంలో ఐటీ సర్వీసెస్ విస్తృతి పరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించిదని వివరించారు. అలాగే పాలనలో సాంకేతికతను పెరుగుతున్న ప్రాముఖ్యతకు ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు మెరుగైన సేవలను అందిస్తుందని ఈ సంస్థ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న సుందరీమణులు

Nawaz Basha: బస్సు కండెక్టర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడి

Saraswathi Pushkaralu: సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Metro Rail: ప్రయాణికులపై మెట్రో బాదుడు

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 16 , 2025 | 04:41 PM