Road Accident: ఆటో బోల్తా.. ముగ్గురు మృతి
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:18 PM
బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొబ్బరి బోండాలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది.
బాపట్ల జిల్లా, డిసెంబర్ 12: ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలతో (Road Accident) ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు (శుక్రవారం) అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
జిల్లాలోని కొల్లూరు మండలం దోనేపూడి వెల్లటూరు మధ్య వేగంగా వస్తున్న ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. కొబ్బరి బోండాల లోడ్‌తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో ఏడుగురు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రమాద స్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆనందబాబు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేష్
డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్
Read Latest AP News And Telugu News