Share News

Stree Shakti Scheme Funds: గుడ్ న్యూస్.. వారి కోసం నిధులు విడుదల చేసిన కూటమి సర్కార్..

ABN , Publish Date - Nov 13 , 2025 | 04:06 PM

సూపర్ సిక్స్‌లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని గత ఆగస్టు నెల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకూ ఈ పథకానికైన ఖర్చును ఏపీఎస్ ఆర్టీసీకి చెల్లిస్తూ కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Stree Shakti Scheme Funds: గుడ్ న్యూస్.. వారి కోసం నిధులు విడుదల చేసిన కూటమి సర్కార్..
Stree Shakti Scheme Funds

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం (Kutami Government) నిరంతరం కృషి చేస్తోంది. వైసీపీ విధ్వంస పాలనలో కుంటుపడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తోంది. ఎన్నికల హామీ మేరకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి సర్కార్ కృషి చేస్తోంది. రాష్ట్రానికి వరసగా పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా సూపర్స్ సిక్స్‌(Super Six)లోని ప్రతి హామీని అమలు చేసి ఔరా అనిపించింది.


సూపర్ సిక్స్‌లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని (Stree Shakti Scheme) గత ఆగస్టు నెల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకూ ఈ పథకానికైన ఖర్చును ఏపీఎస్ ఆర్టీసీకి చెల్లిస్తూ కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మహిళల జీరో ఫేర్ టికెట్ల ఖర్చుకు సంబంధించిన రూ.400 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది చంద్రబాబు సర్కార్. రెండున్నర నెలల్లో మహిళలకు టికెట్లు జారీ చేసిన మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.


ఈ మేరకు రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీశక్తి పథకం కోసం ఆర్టీసీకి నిధులు విడుదల చేయడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్ఎంయూఏ, అలాగే ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

CM Chandrababu: రెండు కీలక ఒప్పందాలు కుదర్చుకోనున్న సర్కార్.. చంద్రబాబు ట్వీట్

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి డోలా

ఏనుగుల సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 13 , 2025 | 04:11 PM