APPSC: గ్రూప్1 స్పోర్ట్స్ కోటాలో 28 మంది తిరస్కరణ
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:42 AM
స్పోర్ట్స్ కోటా గ్రూప్-1 అభ్యర్థులపై శాప్ రూపొందించిన తాత్కాలిక అర్హత జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): స్పోర్ట్స్ కోటా గ్రూప్-1 అభ్యర్థులపై శాప్ రూపొందించిన తాత్కాలిక అర్హత జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 37 మంది అఽభ్యర్థులు హాజరయ్యారు. పత్రాల పరిశీలన అనంతరం 28 మందిని శాప్ తిరస్కరించింది. అర్హులు, అనర్హుల జాబితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. దానిపై ఈనెల 21 ఉదయం 10గంటల వరకు అభ్యంతరాలు పంపొచ్చని కమిషన్ సూచించింది. వాటి ఆధారంగా శాప్ తుది జాబితాను విడుదల చేస్తుంది.