శ్రీశైలంలో నేడు మల్లన్నను దర్శించుకోనున్న గవర్నర్
ABN , Publish Date - Feb 25 , 2025 | 06:22 AM
అమరావతి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు సున్నిపెంటలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

సున్నిపెంట, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనార్థం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం కుటుంబ సమేతంగా శ్రీశైలం వచ్చారు. అమరావతి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు సున్నిపెంటలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ గవర్నర్‌కు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ కుటుంబ సభ్యులు శ్రీశైలం భ్రమరాంబ అతిఽథి గ్రహానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం గవర్నర్ కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు.