Share News

Municipal Fund Guidelines: అభివృద్ధి పనులపై నియంత్రణ స్థానిక సంస్థలకే

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:43 AM

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల కోసం మున్సిపల్‌ నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం, ప్రజారోగ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు సరిపడా నిధులు కేటాయించాలని స్పష్టం చేస్తుంది

Municipal Fund Guidelines: అభివృద్ధి పనులపై నియంత్రణ స్థానిక సంస్థలకే

  • మున్సిపల్‌ నిధుల వినియోగానికి మార్గదర్శకాలు

అమరావతి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్‌ నిధుల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. పబ్లిక్‌హెల్త్‌, శానిటేషన్‌, నీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనకు పట్టణ స్థానిక సంస్థలు పూర్తి ఆర్థిక నియంత్రణ కలిగేలా మార్గదర్శకాలు రూపొందించారు. కొత్త విధానం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో నిధుల వ్యయాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు.

నిర్వహణ వ్యయం: పారిశుధ్య కార్మికులు, తాగునీటి సరఫరా కార్మికుల వేతనాలు, వాహనాల మరమ్మతులు, విద్యుత్‌ చార్జీలు, క్రిమిసంహారక మందుల కొనుగోలు, రోడ్లు, డ్రైన్లు, వీధిలైట్లు, కమ్యూనిటీ టాయ్‌లెట్లు, పార్కులను నిర్వహణ వ్యయంగా పరిగణిస్తారు.

మూలధన వ్యయం: కొత్త రోడ్లు, డ్రైన్లు, వాటర్‌ పైప్‌లైన్లు, మురుగునీటి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, డంపింగ్‌ యార్డులు, కంపోస్టింగ్‌ యూనిట్లు, ఫాగింగ్‌ మెషిన్ల కొనుగోలు, చిన్న వీధిలైట్లు ఏర్పాటు, కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల నిర్మాణాలను మూలధన వ్యయంగా పరిగణిస్తారు.


అభివృద్ధి వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, మహిళలకూ వాటా

మున్సిపల్‌ కార్పొరేషన్లు తమ రాబడుల నుంచి కనీసం 30 శాతం నిధులను మూలధన వ్యయం కోసం ఖర్చు చేయవచ్చు. సెలక్షన్‌ అండ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలు 28, గ్రేడ్‌-1, 2 మున్సిపాలిటీలు 25, గ్రేడ్‌-3, నగర పంచాయతీలు 20 శాతం ఖర్చు చేయవచ్చు. నాన్‌ గ్రాంట్‌ ఆదాయాల నుంచి కనీసం 30 శాతం ప్రజారోగ్యం కోసం వాడుకోవచ్చు. నిల్వ నిధులను తాగునీటి సరఫరాకు 20, డ్రైనేజీకి 13, రోడ్లకు 19, వీధిలైట్లకు 7, రిక్రియేషన్‌ సౌకర్యాలకు 10, మార్కెట్‌లు, భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, టాయ్‌లెట్లకు 17 శాతం నిధులు వినియోగించుకోవచ్చు. కనీసం 40 శాతం నిధులను పట్టణాల్లో మురికివాడల్లో మౌలిక వసతులు, జీవనోపాదుల వృద్ధికి వాడుకోవచ్చు. మొత్తం వార్షిక ప్రణాళికలోని 17.10 శాతం షెడ్యూల్‌ కులాలకు, 5.33 శాతం షెడ్యూల్‌ తెగలకు కేటాయించాలి. అభివృద్ధి వ్యయం ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, మహిళలు, పిల్లలకు 5 శాతం ఖర్చు చేస్తారు. వీధిలైట్లకు, తాగునీటి వనరులకు విద్యుత్‌ చార్జీల చెల్లింపులు మొదటి ప్రాధాన్యంగా ఉండాలి. ఈ బిల్లులు చెల్లించేవరకూ ఏ ఇతర బిల్లులు చెల్లించరాదు.


ఇవి కూడా చదవండి

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Visakhapatnam Mayor: విశాఖ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Read latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 04:43 AM