Gottipati Ravi Kumar: విద్యుత్ మంత్రుల సమావేశం.. కీలక నిర్ణయం
ABN , Publish Date - Jan 30 , 2025 | 10:22 PM
Gottipati Ravi Kumar: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధ్యక్షతన మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అమరావతి, జనవరి 30: కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం తీర్మానం చేసింది. గురువారం అమరావతి సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలుపై ఆయా రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు కూలంకుషంగా చర్చించారు.
డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై వీరు ప్రధానంగా చర్చించారు. అలాగే బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లకు పెంచాలని ఈ సందర్బంగా నిర్ణయించారు. అదే విధంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు కేంద్రం ఇస్తున్న గ్రాంట్‌ను పెంచాలని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కోరారు.
ఆయా రాష్ట్రాల్లో డిస్కంల ఆర్థిక పరిస్థితులపై కీలకంగా చర్చించారు. బకాయిల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలను ఏ విధంగా లాభాల బాట పట్టించి.. ముందుకెళ్లాలనే అంశాలపై ఈ సందర్భంగా మంత్రులు సమాలోచనలు జరిపారు.
అదనపు నష్టాలు, ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన.. ఇతర మొండి బకాయిల వసూళ్లపై ముఖ్యంగా దృష్టి సారించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనితో పాటు పీఎం సూర్యఘర్, కుసుమ్‌లాంటి పథకాలను ప్రోత్సహించి డిస్కంల భారాలను తగ్గించేలా కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు.
Also Read: హెలికాప్టర్, విమానం ఢీ.. 28 మృతదేహాలు వెలికితీత
కేంద్ర ఇంధన శాఖ సూచనలతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటున్న వివిధ రాష్ట్రాల డిస్కంలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులతోపాటు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం..
Also Read: సీఎం ఇంటికి పోలీసులు
Also Read: కేజ్రీవాల్ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?
Also Read: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Also Read: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ
Also Read: జియో సిమ్ వాడుతున్నారా.. ఆ రెండు ప్లాన్స్ గోవిందా..
Also Read: నెలల తరబడి ఇంటికి వెళ్లని ఆ ఉద్యోగులు.. రిలీజ్ ఎప్పుడంటే..?
For AndhraPradesh News And Telugu News