Share News

Goldsmith: స్వర్ణంతో చాంపియన్‌ ట్రోఫీ కప్‌

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:48 AM

భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన మాచర్ల వీరేంద్రకుమార్‌ 1.060 గ్రాముల బంగారంతో కప్‌, బ్యాట్‌, బాల్‌, వికెట్టు తయారు చేశారు.

Goldsmith: స్వర్ణంతో చాంపియన్‌ ట్రోఫీ కప్‌

బంగారంతో వికెట్లు, బాల్‌, బ్యాట్‌ రూపొందించిన ఐలవరం స్వర్ణకారుడు

భట్టిప్రోలు(కొల్లూరు), మార్చి 8(ఆంధ్రజ్యోతి): చాంపియన్‌ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ గెలుపొందాలని ఓ స్వర్ణకారుడు ట్రోఫీకి సంబంధించిన కప్‌, బాల్‌ బ్యాట్‌, వికెట్లు బంగారంతో రూపొందించాడు. ఆదివారం ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుండటంతో భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన మాచర్ల వీరేంద్రకుమార్‌ 1.060 గ్రాముల బంగారంతో కప్‌, బ్యాట్‌, బాల్‌, వికెట్టు తయారు చేశారు. ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆదివారం తాను రూపొందించిన వస్తువులను ఆవిష్కరించనున్నట్టు వీరేంద్రకుమార్‌ తెలిపారు.

‘ఏటికొప్పాక’లో ఒదిగిన ఝాన్సీ లక్ష్మీబాయి!

అనకాపల్లి జిల్లా కళాకారుడి అద్భుత సృష్టి

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకకు చెందిన హస్త కళాకారుడు గొర్సా సంతోశ్‌ మరో అద్భుత కళాఖండానికి ప్రాణం పోశారు. తన వీరోచిత పోరాట పటిమతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి ఆకృతిని అంకుడు కర్రతో, సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి సుమారు 20 రోజులపాటు శ్రమించి తీర్చిదిద్దినట్టు సంతోశ్‌ తెలిపారు. అడుగు పొడవు, అడుగున్నర వెడల్పు గల ఈ కళాఖండాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్ధం చేసినట్టు చెప్పారు.

Untitled-2 copy.jpg

Updated Date - Mar 09 , 2025 | 04:51 AM