Sudarshan Enterprises: శ్రీవారికి స్వర్ణ శంఖు, చక్రాల కానుక
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:31 AM
తిరుమల శ్రీవారికి మంగళవారం బంగారు శంఖు,చక్రాలు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్

తిరుమల, జూలై29(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి మంగళవారం బంగారు శంఖు,చక్రాలు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధులు సుమారు రూ.2.40 కోట్ల విలువైన దాదాపు రెండున్నర కేజీల బరువు కలిగిన బంగారు శంఖు, చక్రాలను రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
హైదరాబాద్ నగరం మల్కాజ్‌గిరిలోని వసంతపురి కాలనీకి చెందిన సునీతాదేవి, కనకదుర్గాప్రసాద్ దంపతులు రూ.18.75 లక్షల విలువైన తమ ఇంటిని మంగళవారం శ్రీవారికి విరాళంగా అందజేశారు. ఈమేరకు వీలునామా పత్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News