Share News

Actress Gautami : విశాఖలో పింక్‌ సఖీ శారీ వాక్‌

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:17 AM

క్యాన్సర్‌ను అధిగమించడం సాధ్యమేనని ప్రముఖ సినీ నటి, లైఫ్‌ అగైన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు గౌతమి పేర్కొన్నారు. క్యాన్సర్‌ రహిత సమాజం రావాలని ఆమె ఆకాంక్షించారు.

Actress Gautami :  విశాఖలో పింక్‌ సఖీ శారీ వాక్‌

  • పాల్గొన్న సినీనటి గౌతమి

విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): భయాన్ని వీడి పోరాడితే క్యాన్సర్‌ను అధిగమించడం సాధ్యమేనని ప్రముఖ సినీ నటి, లైఫ్‌ అగైన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు గౌతమి పేర్కొన్నారు. క్యాన్సర్‌ రహిత సమాజం రావాలని ఆమె ఆకాంక్షించారు. విశాఖ బీచ్‌ రోడ్డులో ఆదివారం క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ‘పింక్‌ సఖీ శారీ వాక్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై కొన్ని అపోహలున్నాయని, దీనిపై అవగాహన పెంచుకుంటే భయాన్ని అధిగమించవచ్చని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, గురుద్వార్‌ సత్సంగ్‌ అధ్యక్షుడు పీఎస్‌ ఆనంద్‌, ఏజ్‌ కేర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి ఎన్‌ఎస్‌ రాజు, రవీంద్ర, వరుణ్‌ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ ఎస్పీ ప్రభుకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 04:17 AM