Share News

Minister Gottipati Ravikumar: విద్యుత్‌ చార్జీలు పెంచం మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:05 AM

విద్యుత్‌ చార్జీలను రూపాయి కూడా పెంచబోమని, మళ్లీ ఎన్నికలు జరిగేలోపు తగ్గించాలని ప్రయత్నిస్తున్నామని విద్యుత్‌ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

Minister Gottipati Ravikumar: విద్యుత్‌ చార్జీలు పెంచం మంత్రి గొట్టిపాటి

విశాఖపట్నం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలను రూపాయి కూడా పెంచబోమని, మళ్లీ ఎన్నికలు జరిగేలోపు తగ్గించాలని ప్రయత్నిస్తున్నామని విద్యుత్‌ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. విశాఖపట్నంలో ఏపీఈపీడీసీఎల్‌ రూ.14 కోట్లతో నూతన టెక్నాలజీ ఈసీబీసీ(ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌)తో నిర్మించిన భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ.. గ్రీన్‌ ఎనర్జీని 24/7 ప్రజలకు అందించడానికి రాయలసీమ ప్రాంతాల్లో సోలార్‌, విండ్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నామని చెప్పారు. విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 180మందికి ఇప్పటి వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.


మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా విద్యుత్‌ అందించేందుకు ఈపీడీసీఎల్‌ రూ.120కోట్లు వెచ్చించిందని తెలిపారు. విధుల్లో ఎవరూ చనిపోకుండా ఉండేందుకు అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించేందుకు నూతన భవనం ఉపయోగపడుతుందన్నారు. సీఎస్‌ విజయానంద్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో 20లక్షల రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్లాంట్లు పెట్టాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా రాయితీలు ఇస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో రాష్ట్రంలో అన్ని డిస్కమ్‌లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Updated Date - Jun 28 , 2025 | 05:05 AM