Mahesh Chandra On Encounter: భారీ ఎన్‌కౌంటర్.. వెలుగులోకి కీలక విషయాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:26 PM
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రా లడ్డా కీలక వివరాలు వెల్లడించారు.
అల్లూరి జిల్లా: మారేడుమిల్లి అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రా లడ్డా వివరాలు వెల్లడించారు. ఈరోజు తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య భద్రతా బలగాలు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిపాయని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.
మృతుల్లో మావోయిస్టుల కీలక నేత హిడ్మా, అతని సతీమణి, మరొక నలుగురు మావోయిస్టులు ఉన్నారని తెలిపారు. మరో ఐదుగురు మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారని చెప్పారు. ఇటీవల మావోయిస్టులకు సహకరిస్తున్న 31 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఇంకా మరో 26 మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని అడిషనల్ డీజీ తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్‌కు చెందినవారని గుర్తించామని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నామని వెల్లడించారు.
ఇదిలా ఉంటే, మరో వైపు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు.. 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్టు సమాచారం. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డెయిరీలో వీరి సమాచారం లభించగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.
Also Read:
విజయవాడలో మావోల కదలికలు.. పోలీసుల అలర్ట్
తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..
For More Latest News