Share News

Atchannaidu Cyclone Montha: సాయంత్రం 5 తర్వాత అన్నీ క్లోజ్: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:35 PM

భవనాలు కలిగిన వారు పేద కుటుంబాలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.

Atchannaidu Cyclone Montha: సాయంత్రం 5 తర్వాత అన్నీ క్లోజ్: మంత్రి అచ్చెన్నాయుడు
Atchannaidu Cyclone Montha

కోనసీమ, అక్టోబర్ 28: ప్రకృతి వైపరీత్యాలను ఆపడం మన చేతిల్లో లేదని... కానీ ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవడం మాత్రం ప్రభుత్వ బాధ్యతని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ... పోలీసు, రెవెన్యూ శాఖలతో అనుసంధానమై పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని.. సాయంత్రం ఐదు గంటల తర్వాత రోడ్లన్నీ బ్లాక్ చేస్తామని ప్రకటించారు. భవనాలు కలిగిన వారు పేద కుటుంబాలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మంత్రి తెలిపారు.


ఎక్కడైనా చెట్లు కూలినా, రహదారులు మూసుకుపోయినా ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు తక్షణమే చర్యలు తీసుకుంటాయని అన్నారు. నర్సాపురం, రాజోలులో తుపాను తీరం తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత ప్రజలంతా ఇండ్లకు చేరుకోవాలని సూచించారు. తుపాను సమయంలో ఎవరూ బయటకు రాకూడదని హెచ్చరించారు. ఆహారం, పాలు, తాగునీరు అన్ని పునరావాస కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. రైతాంగం, ఆక్వా రంగం ఆందోళన చెందవద్దని... పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ‘ఇది ఒక విపత్తు.. కానీ మనం కలిసికట్టుగా ఎదుర్కోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పత్తి రైతులకు సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 06:14 PM