Share News

Janasena: వారిపై చర్యలు తీసుకోవాలి.. జనసేన ఫిర్యాదు..

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:47 AM

Janasena Complaint: యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పిఠాపురం టౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Janasena: వారిపై చర్యలు తీసుకోవాలి.. జనసేన ఫిర్యాదు..
Janasena

Kakinada: 11వ అంత‌ర్జాతీయ యోగా దినోత్సవం (11th International Yoga Day) సందర్భంగా ఉపముఖ్యమంత్రి (Deputy CM) పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై సోషల్ మీడియా (Social Media)లో అనుచిత, అవమానకరమైన (Harassment) పోస్టులు పెట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పిఠాపురం (Pithapuram) టౌన్ పోలీస్టేషన్‌ (Police Station)లో జనసేన నాయకులు (Janasena Leaders) పిర్యాదు (Complaint) చేశారు. ‘RandomForest’తో పాటు పలు సోషల్ మీడియా ఖాతాలలో వైజాగ్‌లో యోగా చేస్తూ రిలాక్స్ అవుతున్న డిషిఎం’ అంటూ పవన్ కళ్యాణ్ స్థానంలో కుక్కని పెట్టి మార్ఫింగ్ చేసి అనుచితంగా, అవమానకరంగా పోస్టులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కాగా విశాఖ తీరంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే.. దాన్ని మన ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. భారతీయ సనాతన ధర్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘటన ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని ఈ సందర్భంగా పవన కల్యాణ్ వ్యాఖ్యానించారు.


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ 30.16 కిలోమీటర్ల మేర 3,03,654 మందితో చేపట్టిన యోగా ప్రదర్శన గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. 2023లో గుజరాత్‌లోని సూరత్‌లో 1.47 లక్షల మందితో యోగా నిర్వహించడమే ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించినట్టయింది. అలాగే, శుక్రవారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి కూడా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ చోటు దక్కింది. ఈ రెండు రికార్డులకు సంబంధించిన పత్రాలను మంత్రి నారా లోకేశ్‌కు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు శనివారం ఆర్కే బీచ్‌రోడ్డులోని యోగా ప్రధాన వేదిక వద్ద అందజేశారు.


ఇవి కూడా చదవండి:

విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం

హైదరాబాద్‌లో రెండు వేర్వేరు అగ్నిప్రమాదాలు..

అవినాష్ అనుచరుల వల్ల నాకు ప్రాణహాని..: సునీల్ కుమార్ యాదవ్

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 22 , 2025 | 11:47 AM