Gorantla Madhav: వైసీపీ నేతలను ఎవ్వరూ ఏం చేయలేరు: గోరంట్ల మాధవ్..
ABN , Publish Date - Apr 29 , 2025 | 08:23 PM
Gorantla Madhav: మరోసారి సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. బెయిల్‌పై మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనతోపాటు మరో ఐదుగురు అనుచరులు విడుదలయ్యారు.

రాజమండ్రి, ఏప్రిల్ 29: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి గెలిచేది లేదని.. వైసీపీ ఓడేది లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎవరెన్ని చేసినా వైసీపీ నేతలను ఏం చేయలేరంటూ ప్రగల్బాలు పలికారు గోరంట్ల మాధవ్. మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గోరంట్ల మాధవ్, అతని ఐదుగురు అనుచరులు విడుదలయ్యారు. అనంతరం విలేకర్లతో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. రోజుకొక అక్రమ అరెస్టు చేస్తూ వైసీపీ నేతలను వేధిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆలోచనా విధానాలకు నూకల చెల్లాయన్నారు. ఇప్పటికైనా అక్రమ అరెస్టులకు పుల్ స్టాప్ పెట్టి పథకాల అమలు వైపు దృష్టి సారించాలని హితవు పలికారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై టీడీపీ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా అతడిని అరెస్ట్ చేయాలంటూ కూటమి ప్రభుత్వం గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి.. గుంటూరు తీసుకెళ్తున్న సమయంలో చేబ్రోలు కిరణ్ కుమార్, ఎస్కార్ట్ పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో అతడిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. దీంతో గోరంట్ల మాధవ్‌తోపాటు అతడి అనుచరులను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో ఈ నెల 23న మాధవ్‌ను పోలీసులు రెండ్రోజులు కస్టడీకి తీసుకున్నారు. 24న విచారణ ముగిశాక తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు.
మరోసారి ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని నగరంపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాధవ్ తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ వేశారు. ఇరువర్గాల వాదనల అనంతరం సోమవారం గోరంట్ల మాధవ్, ఆయన అనుచరులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి శనివారం పోలీసు స్టేషన్లో హాజరై రిజిస్టర్‌లో సంతకం చేయాలని షరతు విధించింది. పూచీకత్తులు సమర్పించిన అనంతరం మంగళవారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
ఇవి కూడా చదవండి
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
For More AP News and Telugu News