Share News

రైతుల ఇబ్బందులు తీరేలా..

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:32 AM

సాగునీటి సరఫరాలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా క్లోజర్‌, వరద పనుల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోం ది. ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు ఇందుకు సం బంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించగా, వారం రోజుల్లో వీటికి ఆమోదం లభించ నుంది. వైసీపీ అయిదేళ్ల పాలనలో కాలువల నిర్వహణ, క్లోజర్‌ పనులకు పైసా విదల్చకపోవడంతో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో

రైతుల ఇబ్బందులు తీరేలా..
పిఠాపురం మండలం రాపర్తి గ్రామశివారులో గొర్రిఖండి కాలువకు పడిన గండి

వరద పనులకు రూ. 19.65 కోట్లు

క్లోజర్‌ వర్కులకు మరో రూ. 8 కోట్లు

ఇప్పటికే రూ 5.50 కోట్లతో అత్యవసర పనుల నిర్వహణ

వైసీపీ అయిదేళ్ల పాలనలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం

(ఆంధ్రజ్యోతి-పిఠాపురం)

సాగునీటి సరఫరాలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేలా క్లోజర్‌, వరద పనుల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోం ది. ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు ఇందుకు సం బంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించగా, వారం రోజుల్లో వీటికి ఆమోదం లభించ నుంది. వైసీపీ అయిదేళ్ల పాలనలో కాలువల నిర్వహణ, క్లోజర్‌ పనులకు పైసా విదల్చకపోవడంతో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైంది. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వంలో పనుల నిర్వహణకు ముందస్తుగానే కార్యాచరణ సిద్దం చేసి కాలువలకు నీటి విడుదల నిలిపివేయగానే పనులను ప్రారంభించేందుకు సమాయాత్తమవుతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్‌ నెలల్లో పంటకాలువలకు సాగునీటి సరఫరా నిలిపివేసి తిరిగి జూన్‌ లో విడుదల ప్రారంభిస్తారు. కాలువలు మూసివేసి తిరిగి తెరిచే మధ్య కాలాన్ని క్లోజర్‌గా పరిగణించి ఆ సమయంలో కాలువల నిర్వహణకు అవసరమైన పనులు, కట్టడాలు, కళింగల్స్‌, రెగ్యు లేటర్లు, ఇతర సాగునీటి నియంత్రణ వ్యవస్థలకు మరమ్మతులు నిర్వహించడం, కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, పూడికలు తొలగించడంతో పాటు చివరి ఆయకట్టు వరకూ సాగునీటి సరఫరాకు అవసరమైన పనులను నిర్వహిస్తారు. వీటి ని క్లోజర్‌ పనులుగా వ్యవహరిస్తారు. ఇవి ప్రతి ఏటా నిర్వహిస్తేనే సాగునీటి సరఫరా సక్రమంగా సాగుతుంది. అయితే గత అయిదేళ్ల వైసీపీ పాలనలో క్లోజర్‌ పనుల నిర్వహణను గాలికి వదిలేశా రు. ఫలితంగా సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆ సమయంలో వచ్చిన వరదలకు అరకొరగానే పనులు నిర్వహించారు. దాని ఫలితంగా గత ఖరీఫ్‌, రబీ సమయాల్లో రైతులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారు. ఈసారి ఆ పరిస్థితి ఏర్పడ కుండా ఉండేందుకుగానూ క్లోజర్‌ పనులకు కూట మి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ముం దుగానే ఇరిగేషన్‌ అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుంది. కాలువలు మూసివేసే సమయానికి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. వాస్తవానికి గత ఏడాది ఏలేరు, సుద్దగడ్డ, తాండవకు వచ్చిన వరదల కారణంగా ఏలేరు, తాండ వ, పంపా, పీబీసీ కాలువలకు కాకినాడ జిల్లాలో భారీగా గండ్లు పడ్డాయి. పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, తుని, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో రూ.25 కోట్ల వ్యయంతో 280 పనులను నిర్వహించాలని వరదలు తగ్గగానే ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదించారు. ఇందులో అత్యవసరంగా చేపట్టాల్సిన గండ్లు పూడ్చివేత, ఇతర పనుల నిర్వహణకు రూ.5.50కోట్లను గత అక్టోబరులో మంజూరుచేయగా ఆ నిధులతో రెండు విడతలుగా 67 పనులు నిర్వహించారు. ఇప్పుడు రూ.19.50 కోట్ల వ్యయంతో 213 పను ల నిర్వహణకు ప్రతిపాదనలు పంపారు. అలా గే కాలువలు, రెగ్యులేటర్లు, స్లూయిజ్‌లు, కళింగల్స్‌ నిర్వహణ, మరమ్మతులు, గుర్రపుడెక్క, పూ డిక తొలగింపులు వంటి పనులకు రూ.8 కోట్ల వ్యయంతో 199 పనులను ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. వరద సంబంధిత పనులతో పాటు క్లోజర్‌ పనులకు వారంలోపే ఆమోదం వస్తుందని ఇరిగేషన్‌ వర్గాలు చెబుతున్నాయి.

సాగునీటి సంఘాల ద్వారా పనులు

క్లోజర్‌, వరద పనులన్నింటినీ సాగునీటి సంఘాల ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ సంఘాల ద్వారా నామినేషన్‌ పద్ధతిపై కేటాయించి నిర్వహించాలని నిర్ణయించడంతోపాటు నామినేషన్‌ పద్ధతిపై పనులు నిర్వహించే పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ పెం చాలని ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా ముందు పంపిన ప్రతిపాదనల్లో మార్పు చేసి ప్రతి పనిని రూ.10 లక్షలకే పరిమితం చేసి పంపారు. దీనివల్ల పనుల నిర్వహణకు టెం డర్లు పిలిచి కాంట్రాక్టు ఖరారైన తర్వాత పను లు చేపట్టేందుకు పట్టే సుమారు 30-40 రోజుల సమయం ఆదా అవుతుంది. ఈ సమ యంలోనే పనులన్నింటినీ ప్రారంభించి పూర్తి చేయనున్నారు. గోదావరి కాలువలకు ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి నీటి విడుదలను నిలిపివేయనున్నారు. అదే సమయంలో ఏలేరు కాలువలకు నీటి విడుదలను నిలిపివేస్తారు.

Updated Date - Apr 19 , 2025 | 01:32 AM