Share News

Youth drown in Godavari River: మహాశివరాత్రి వేళ గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకులు.. అంతలోనే

ABN , Publish Date - Feb 26 , 2025 | 09:54 AM

Godavari River: స్నేహితులంతా కలిసి సరదా కోసం ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ బాగా ఎంజాయ్ చేశారు కూడా. కానీ అంతులోనే అనుకోని ఉపద్రవం వారిని ముంచెత్తింది.

Youth drown in Godavari River: మహాశివరాత్రి వేళ గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకులు.. అంతలోనే
Five youths drown in godavari river

తూర్పుగోదావరి, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి (Mahashivaratri) పర్వదినం రోజున జిల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. తాడిపూడి ఇసుక ర్యాంపులో గోదావరి స్నానానికి యువకులు దిగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గజఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన ఐదుగురు యువకులు.. తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్ , అనీసెట్టి పవన్, గర్రె ఆకాష్ , పడాల సాయిగా గుర్తించారు. యువకుల తల్లిదండ్రులు, బంధువులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


తాడిపూడి గ్రామానికి చెందిన పదకొండు మంది యువకులు మహాశివరాత్రి కావడంతో గోదావరిలో స్నానానికి వెళ్లారు. తాడిపూడిలోని ఇసుక ర్యాంపు వద్ద స్నానానికి వెళ్లారు యువకులు. కాసేపు సరదాగా గోదావరి ఈత కొట్టారు. కానీ అంతలోనే ఇసుకర్యాంపులో వీరంతా కూరుకుపోయారు. పదకొండు మందిలో ఐదుగురు ఇసుకర్యాంపులో కూరుకుపోగా.. మిగిలిన ఆరుగురు యువకులు సురక్షితంగా బయటబట్టారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారు స్థానికులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు కూడా విషయం తెలియడంతో వారంతా అక్కడకు చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా యువకుల ఆచూకీ లభించలేదు. ఈ పదకొండు మంది యువకులు కూడా తాడిపూడి గ్రామానికి చెందిన వారే కావడంతో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి.

ఈ శివుడిని దర్శించుకుంటే పిల్లలు పుడతారంట..


ఈ యువకుల్లో పలువురు జనసేన పార్టీకి చెందిన అభిమానులు, విద్యార్థులు ఉన్నారు. వీరంతా కలిసి మహాశివరాత్రిని పురస్కరించుకుని గోదావరిలో స్నానానికి వెళ్లగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గతంలో స్నానాలకు వెళ్లే ప్రాంతంలో కాకుండా వేరే చోటకు వెళ్లగా.. అక్కడంతా పెద్ద పెద్ద గోతులు ఉండటాన్ని గుర్తించకపోవడంతో యువకులు ప్రమాదం బారిన పడినట్లు తెలుస్తోంది. కళ్లముందే తమ బిడ్డలు ప్రమాదంలో పడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న పరిస్థితి. కూలీ పనిచేసుకుంటూ తమ బిడ్డలను చదివిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే చేతికి వచ్చిన బిడ్డలు ఇలా ప్రమాదంలో చిక్కుకోవడంతో వారి ఆవేదనకు అంతేలేకుండా పోయింది. ప్రస్తుతం యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

ఇదెక్కడి ఫ్యాషన్‌రా నాయనా..

ఆ ఎనిమిది మంది సురక్షితంగా తిరిగి రావాలంటూ...

Read Latest AP News And Telugu news

Updated Date - Feb 26 , 2025 | 10:18 AM