గోదావరిలో బోట్ రేస్
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:34 AM
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 28( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం గోదావరి నదిలో బోట్ రేస్ అట్టహాసంగా జరిగింది. నదీజలాలపై అవగాహన కల్పించడానికి జాతీయ జలవనరుల శాఖ, జలశక్తి విభాగం, నదీసంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. దీనిని కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలరేవు ఎదురుగా ఉన్న గోదావరి లం

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 28( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం గోదావరి నదిలో బోట్ రేస్ అట్టహాసంగా జరిగింది. నదీజలాలపై అవగాహన కల్పించడానికి జాతీయ జలవనరుల శాఖ, జలశక్తి విభాగం, నదీసంరక్షణ సంస్థ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. దీనిని కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. పుష్కరాలరేవు ఎదురుగా ఉన్న గోదావరి లంక నుంచి 15 నావలు ఈ పోటీలో పాల్గొన్నాయి. లంక నుంచి పుష్కరాలరేవుకు ఈ రేస్ నిర్వహించారు. ఇంజన్ బోట్లు కాకుండా ఏతం వేసే బోట్లను పోటీలో దింపారు. సుమారు గంట పాటు జరిగిన పోటీలో ప్రథమ స్థానంలో నాతి పోసయ్య, ద్వితీయ స్థానంలో మల్లాడి సుబ్బన్న, తృతీయ స్థానంలో పోతాబత్తుల నాగరాజు నిలిచారు. ప్రథమ బహుమతిగా రూ25వేలు, ద్వితీయ బహుమతిగా రూ15వేలు. తృతీయ బహుమతిగా రూ10వేలు నగదును సాయంత్రం పుష్కరాలరేవులో జరిగిన ముగింపు కార్యక్రమంలో అందించారు. గోదావరి జలల పరిరక్షణ కోసం ఈ బోట్ రేస్‌ను ఏర్పాటు చేశామని కమిషనర్ చెప్పారు.