Share News

DRDO Donakonda Missile Unit: దొనకొండలో క్షిపణి తయారీ యూనిట్‌..

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:37 AM

ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.

DRDO Donakonda Missile Unit: దొనకొండలో క్షిపణి తయారీ యూనిట్‌..
DRDO Donakonda Missile Unit

  • భూములు పరిశీలించిన డీఆర్‌డీవో ప్రతినిధులు

దొనకొండ, జూలై 20 (ఆంద్రజ్యోతి): ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. భారత రక్షణకు శాఖ చెందిన డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ప్రతినిధుల బృందం ఆదివారం ఈ ప్రాంతంలో పర్యటించింది. ఈ బృందానికి కనిగిరి ఆర్డీవో జి.కేశవర్దన్‌రెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మదన్‌మోహన్‌ దొనకొండలోని బాదాపురం రెవెన్యూలో ఉన్న ప్రభుత్వ భూములను చూపించారు. సరిహద్దులు, ఇక్కడ లభ్యమయ్యే మౌలిక సదుపాయాలు, ఇతర వివరాలను మ్యాపుల ద్వారా వివరించారు. అనంతరం డీఆర్‌డీవో ప్రతినిధులు దొనకొండలో బ్రిటిష్‌ కాలంలో ఏర్పాటై.. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాన్ని సందర్శించారు. విమానాశ్రయం మొత్తం ఎంత విస్తీర్ణంలో ఉంది, అప్పట్లో రన్‌వే ఏవిధంగా ఉండేది.. తదితర సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఈడీబీ అధికారిణి ఐశ్వర్య, తహసీల్దార్‌ రమాదేవి, డిప్యూటీ తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం బ్రహ్మోస్‌ క్షిపుణుల తయారీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దొనకొండలో రక్షణశాఖ ఆధ్వర్యంలో మిస్సైల్‌ తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు ఈ భూములను పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:37 AM