Share News

Diamond Hunt: ఒక్క వజ్రం జీవితాన్నే మార్చేస్తుందని..

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:19 AM

తొలకరి జల్లులు పడితే అన్ని చోట్లా రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతారు. కానీ ఇక్కడ మాత్రం కుటుంబాలు, కుటుంబాలు వజ్రాల వేటలో నిమగ్నమవుతాయి. వర్షపు జల్లులు తమకు అదృష్టం పండిస్తాయోమోనని ఆశగా అక్కడకి వచ్చిన వారు ఎదురుచూస్తారు.

Diamond Hunt: ఒక్క వజ్రం జీవితాన్నే మార్చేస్తుందని..

  • పత్తికొండ, తుగ్గలి, మద్దికెరలో విస్తృత అన్వేషణ

  • కుటుంబాలతో తరలివచ్చి అక్కడే బస

తుగ్గలి, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): తొలకరి జల్లులు పడితే అన్ని చోట్లా రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతారు. కానీ ఇక్కడ మాత్రం కుటుంబాలు, కుటుంబాలు వజ్రాల వేటలో నిమగ్నమవుతాయి. వర్షపు జల్లులు తమకు అదృష్టం పండిస్తాయోమోనని ఆశగా అక్కడకి వచ్చిన వారు ఎదురుచూస్తారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి, మద్దికెర మండలాల పరిధిలోని ఎర్రగుడి, జొన్నగిరి, చిన్నజొన్నగిరి, పగడిరాయి, అమినేబాద్‌, తుగ్గలి, మదనంతపురం, పెరవలి పంటపొలాల్లో వర్షాలు ప్రారంభమైన వెంటనే విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి. వజ్రాలు దొరుకుతున్నాయనీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో నంద్యాల, తాడిపత్రి, అనంతపురంతో పాటు, గుంటూరు, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఈ ఏడాది ఇక్కడకు వచ్చి అన్వేషిస్తున్నారు. వేల సంఖ్యలో ఆటోలలో, కార్లలో ఇంటిల్లిపాది వచ్చి వెదుకుతున్నారు. వచ్చిన వారు దాదాపు వారం రోజులకు సరిపడా బియ్యం, సరుకులు తీసుకుని వచ్చి పొలాల్లోనే వంట చేసుకుంటూ అన్వేషణ కొనసాగిస్తున్నారు. చిన్నారులకు వారి వాహనాల్లోనూ, చెట్లకు ఊయలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ జీవితం మారిపోతుందని పలువురు చెబుతున్నారు. అప్పులు తీర్చుకోవడానికే ఈ అన్వేషణ చేస్తున్నామని మరికొందరు తెలిపారు. హోటళ్ల ఖర్చులు భరించలేక వండుకుని తింటున్నామని వెల్లడించారు.

Updated Date - Jun 09 , 2025 | 04:21 AM