Tirumala Accident: వైకుంఠం క్యూకాంప్లెక్స్ పైనుంచి పడిన భక్తుడు
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:27 AM
తిరుమలలో వైకుం ఠం క్యూకాంప్లెక్స్ పైఅంతస్తు నుంచి జారి కిందపడి ఓ భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు.

తిరుమల, జూలై16(ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైకుం ఠం క్యూకాంప్లెక్స్ పైఅంతస్తు నుంచి జారి కిందపడి ఓ భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశాలోని గంజాం జిల్లా, బడాంపుర్‌కు చెందిన ఎల్లయ్య రెడ్డి(50) బుధవారం ఉదయం వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద కింద నుంచి పైఅంతస్తుకు గేట్లు పట్టుకుని ఎక్కే ప్రయత్నంలో జారి 25 అడుగుల కిందకు పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో తొలుత తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి.. అక్కడి నుంచి తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని స్నేహితులు వివరించారు.