Srisailam Reservoir Repairs: టెలిమెట్రీల ఏర్పాటుతో సమస్యలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:08 AM
ఆందోళన కలిగిస్తున్న శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్ మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న నిర్ణయంపై..

శ్రీశైలం ప్లంజ్‌పూల్ మరమ్మతులపై నిర్ణయం హర్షణీయం: లక్ష్మీనారాయణ
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఆందోళన కలిగిస్తున్న శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్ మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న నిర్ణయంపై రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక సమన్వయకర్త, సాగునీటి రంగ నిపుణుడు టి.లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో రెండు రాష్ట్రాల సీఎంల చర్చలను స్వాగతించారు. ‘కృష్ణా నదిపై ఉమ్మడి జలాశయాల నుంచి నీటి వినియోగంలో టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయం మంచిదే. అయితే ఏపీ భూభాగంలోనూ వాటిని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్‌తో సమస్యలు తలెత్తుతారు’ అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్