డీఎస్సీ సిలబస్ సవరించాలి: ఏపీటీఎఫ్- అమరావతి
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:50 AM
ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ మెగా డీఎస్సీ సిలబస్‌ను పదో తరగతి వరకు మాత్రమే సవరించాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లు పదో తరగతి వరకు బోధన చేయడంతో, సిలబస్‌ను మార్చాలని అన్నారు.

అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్లకు సిలబస్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కాకుండా పదో తరగతి వరకు మాత్రమే ఉండేలా సవరించాలని ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. స్కూల్ అసిస్టెంట్లు పదో తరగతి వరకు మాత్రమే బోధన చేస్తారని, అందువల్ల సిలబస్ మార్చాల్సిన అవసరం ఉందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.