Nellore : రైతాంగ, కార్మిక వ్యతిరేక బడ్జెట్
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:43 AM
నెల్లూరులో సీపీఎం, సీఐటీయూ నేతలు బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు (ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో) జరుగుతున్నాయి.

నెల్లూరులో ప్రతులు దహనం చేసిన సీపీఎం, సీఐటీయూ
నెల్లూరు (వైద్యం), ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందని సీపీఎం, సీఐటీయూ విమర్శించాయి. ఈ మేరకు నెల్లూరులో సీపీఎం, సీఐటీయూ నేతలు బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు (ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో) జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం వారు స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద బడ్జెట్‌కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. అనంతరం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ... కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సంపన్నులకు ఊడిగం చేసేదిలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ రైతుల ఆర్ధికాభివృద్ధికి వ్యతిరేకంగా ఉందని, దీన్ని దేశంలోని రైతులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ... ఈ బడ్జెట్ వల్ల వ్యవసాయ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వలేదని దుయ్యబట్టారు. కాగా, సీపీఎం రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా సోమవారం నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ప్రత్యేక అతిఽథిగా హాజరుకానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News