V. Srinivasa Rao : ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:45 AM
విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు’ అనే అంశంపై విశాఖలో శనివారం నిర్వహించిన సదస్సులో...

ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదు: సీపీఎం శ్రీనివాసరావు
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం), జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు’ అనే అంశంపై విశాఖలో శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వనరులను దోచుకునే అభివృద్ధి తమకు వద్దన్నారు. మానవాభివృద్ధికి ప్రత్యామ్నాయ విధానాల కోసం సీపీఎం పోరాడుతుందన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నెల్లూరులో సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలు జరగనున్న నేపథ్యంలో విజయవాడ, కర్నూలు, విశాఖల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదని, సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు వికేంద్రీకరణ జరగాల్సి ఉందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..