Share News

Computer Science Engineering: సీఎస్ఈ ఫుల్‌.. మిగతావి డల్‌!

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:32 AM

ఇంజనీరింగ్‌ విద్యలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ సీఎస్ఈ హవా కొనసాగుతోంది..

Computer Science Engineering: సీఎస్ఈ ఫుల్‌.. మిగతావి డల్‌!

  • కంప్యూటర్‌ సైన్స్‌లో 75 వేలకుపైగా సీట్లు భర్తీ

  • మిగిలిన అన్ని బ్రాంచ్‌ల్లో సుమారు 40 వేలే

  • 28 బ్రాంచ్‌ల్లో వంద శాతం నిండిన సీట్లు

  • మెకానికల్‌, సివిల్‌కు తగ్గిపోతున్న డిమాండ్‌

అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్యలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్ఈ) హవా కొనసాగుతోంది. ఈఏపీసెట్‌ తొలి విడత కేటాయింపుల్లో అత్యధిక సీట్లు సీఎ్‌సఈ బ్రాంచ్‌ల్లోనే భర్తీ అయ్యాయి. సీఎస్ఈ బ్రాంచ్‌ల్లో 75 వేలకుపైగా సీట్లు భర్తీ అయితే, మిగిలిన అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి 40 వేల సీట్లు మాత్రమే నిండాయి. సీఎ్‌సఈకి డిమాండ్‌ పెరగడంతో దాని అనుబంధ బ్రాంచ్‌లు పెరిగిపోయాయి. విద్యార్థులు కూడా కోర్‌ బ్రాంచ్‌లైన మెకానికల్‌, సివిల్‌ను పక్కనపెట్టి సీఎస్ఈలో కొత్తగా వచ్చిన బ్రాంచ్‌లైనా ఫరవాలేదంటూ వాటిలోనే సీట్లు కోరుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ర్టానికి లక్షకు పైగా సీఎస్ఈ సీట్లను ఏఐసీటీఈ మంజూరు చేసింది. వాటిలో సుమారు 85 వేలు కన్వీనర్‌ కోటా కింద ఉన్నాయి. బుధవారం జరిగిన సీట్ల కేటాయింపులో సుమారు 75వేల సీట్లు సీఎస్ఈలో భర్తీ అయ్యాయి.


సీఎస్ఈ కోర్‌లో 47,519 సీట్లు అందుబాటులో ఉంటే 41,504 సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈ ఏఐఎంఎల్‌లో 13,602, సీఎస్ఈ డేటా సైన్స్‌లో 5,912, సీఎస్ఈ ఏఐలో 5,140, సీఎస్ఈ సైబర్‌ సెక్యూరిటీలో 1,662, సీఎస్ఈ ఏఐ-డేటాసైన్స్‌లో 1,483, సీఎస్ఈ ఐవోటీ అండ్‌ సైబర్‌ సెక్యూరిటీ విత్‌ బ్లాక్‌ చైన్‌లో 676, సీఎస్ఈ ఐటీలో 506, సీఎస్ఈ ఐవోటీలో 256, సీఎస్ఈ క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో 137, ఇతర సీఎస్ఈ బ్రాంచ్‌ల్లో మరికొన్ని సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈలో 25,250 సీట్లు ఉంటే 18,846 సీట్లు భర్తీ అయ్యాయి. ఈఈఈలో 8,564 సీట్లకు 5,155 నిండాయి. మెకానికల్‌ బ్రాంచ్‌లో 7,743 సీట్లు ఉంటే 4,653 భర్తీ అయ్యాయి. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 6,507 సీట్లకు 3,760 మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తంగా 28 బ్రాంచ్‌ల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇవి కాకుండా మేనేజ్‌మెంట్‌ కోటాలో 50 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోనూ ఎక్కువ శాతం సీట్లు సీఎస్ఈ బ్రాంచ్‌ల్లోనే ఉన్నాయి. అవి కూడా కలిపితే ఈ ఏడాది లక్షకు పైగా సీఎస్ఈ సీట్లు భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. కోర్‌ బ్రాంచ్‌లకు ఏటా ఆదరణ తగ్గిపోతోంది. గతంలో మెకానికల్‌, సివిల్‌, ఈఈఈలకు డిమాండ్‌ ఉండేది. కానీ విద్యార్థులంతా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలనే లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో సీఎస్ఈ సీట్లు హాట్‌ కేకుల్లా భర్తీ అవుతున్నాయి. అందుకే కాలేజీలు కూడా సీఎస్ఈ సీట్లు పెంచుకుని మిగిలిన బ్రాంచ్‌ల్లో సీట్లు తగ్గించుకుంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‏లు

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

For More National News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:32 AM