Peddi Reddy Ramachandra Reddy: పెద్దిరెడ్డితో కొలికపూడి... వీడియో వైరల్
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:05 AM
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలిసిన వీడియో సోషల్

తిరుపతిలో యాదృచ్ఛికంగా కలిశాం: శ్రీనివాసరావు
విజయవాడ, జూలై 23(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలిసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పెద్దిరెడ్డిని టీడీపీ శ్రేణులు ఎంతగా వ్యతిరేకిస్తాయో తెలిసినప్పటికీ కొలికపూడి ఆయనతో సంభాషించడంపై సోషల్‌మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో పెద్దిరెడ్డిని కలిశారంటూ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయం ఖండించింది. ‘శుక్రవారం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో సహా తిరుపతికి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయంలో పెద్దిరెడ్డి ఎదురుపడితే మర్యాదపూర్వకంగా పలకరించారు. దీన్ని వక్రీకరించటాన్ని ఖండిస్తున్నాం’ అని పేర్కొంది.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!