AP CM : చింతమనేనిపై సీఎం సీరియస్
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:45 AM
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.

భాష మార్చుకోవాలని వార్నింగ్
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్లిన సందర్భంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారును ఉద్దేశపూర్వకంగా తన కారుకు అడ్డంగా పెట్టడంతో డ్రైవర్‌ను ప్రభాకర్ దూషించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది, శుక్రవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఎంను ఎమ్మెల్యే కలిశారు. తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని, తీరు మార్చుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.